Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన సంస్కృతీ సంప్రదాయాలపై గౌరవం ఉంది...ఇలాంటి యాడ్ చేయలేను: నవాజుద్దీన్ సిద్దిఖీ

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ బంపర్ ఆఫర్ ను వదులుకున్నాడు. భజరంగీ భాయ్ జాన్, మాంఝీ సినిమాలు సూపర్ హిట్ కావడంతో నవాజుద్దీన్ సిద్దిఖీకి క్రేజ్ పెరిగింది. దీంతో నవాజ్ ను భారీ ఆఫర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఈ నటుడిని ఓ అంతర్జాతీయ కంపెనీ సంప్రదించింది. ఓ యాడ్ చేయాలని కోరింది. ఈ యాడ్ చేస్తే భారీ మొత్తం ముట్టజెపుతామని ఆఫర్ ఇచ్చింది. ఇంతకీ యాడ్ ఏంటని అడిగిన నవాజ్ కు 'కండోమ్ యాడ్' అని అసలు విషయం చెప్పింది సదరు కంపెనీ. తనకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై గౌరవం ఉంది కనుక ఇలాంటి యాడ్ చేయలేనని గౌరవంగా చెప్పి తప్పించుకున్నాడు. డిమాండ్ ఉంది కదా అని ఏది పడితే అది చేయలేనని నవాజుద్దీన్ సదరు కంపెనీకి తేల్చిచెప్పాడు.

More Telugu News